టాలీవుడ్ యంగ్ హంక్ రానా ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ‘బాహుబలి’ ఒకటైతే, గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ‘రుద్రమదేవి’ రెండవది. రానా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఒక్క హీరో గానే కాకుండా పలు వైవిధ్యమైన పాత్రలని కూడా చేస్తున్నాడు.
ఓ ప్రముఖ మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క హీరో ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది. మీకు ఎలాంటి ఇమేజ్ ఉంది అని రానాని అడిగితే ‘ నేను ఏ రకమైన ఇమేజ్ కి ఫిక్స్ అవ్వలేదు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. విశ్వరూపం డబ్బింగ్ జరుగుతున్న సమయంలో నేను కమల్ హాసన్ గారిని కలిసాను. అప్పుడు ఆయన నాతో ‘ఎప్పుడైతే పాత్రకి తగ్గట్టు నిన్ను నీవు మలుచుకోలేకపోతే దానికి కారణం నీ ఇమేజ్ లేదా నీలో అంత సామర్థ్యం లేకపోవడం. అలాంటప్పుడు నువ్వు నటించడం ఆపేయాలని’ ఆయన అన్నారు. అందుకే నేను ఎంచుకున్న పాత్రలో ఎంతో ఇన్వాల్వ్ అయ్యి చేస్తాను. నన్ను రానా కంటే నేను చేసిన పాత్ర ద్వారా గుర్తు పెట్టుకోవాలనుకుంటానని’ రానా సమాధానం ఇచ్చాడు.