మంచు ఫ్యామిలీ హీరోస్ అయిన డా. ఎం మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘పాండవులు పాండవులు తుమ్మెద’. అలాగే వీరికి జోడీగా రవీనా టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ గ్రూప్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణలో ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. దాంతో షూటింగ్ చాలా సందడిగా జరుగుతోంది.
శ్రీ వాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డా. ఎం.మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి, మణిశర్మ, బప్పి లహరి, బాబా సెహగల్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అన్ని అనుకున్న టైంకి కంప్లీట్ అయితే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.