థియేటర్స్ లో ప్రసారం కానున్న మహేష్ ‘1’ ఆడియో

థియేటర్స్ లో ప్రసారం కానున్న మహేష్ ‘1’ ఆడియో

Published on Dec 3, 2013 1:30 PM IST

1_Nenokkadine_Audio_Poster
స్టార్ హీరోల సినిమా ఆడియో ఫంక్షన్ అంటే ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది. అభిమానులు ఎక్కువగా వస్తారు కాబట్టి దాదాపు పెద్ద వేదికని ఎంచుకుంటారు. అలాగే అభిమానులేమో ఎంట్రీ పాస్ ల కోసం తెగ ట్రై చేస్తుంటే, చానల్స్ ఏమో మేము కవరేజ్ ఇస్తాం మేము కవరేజ్ ఇస్తాం అని పోటీ పడుతుంటాయి. ఇవన్నీ కామన్ గా జరిగేటివే.. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘1-నేనొక్కడినే’ ఆడియో రిలీజ్ ని కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.

యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని ఈ నెల 19న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో రిలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో వేడుకని అందరూ చూడాలనే ఉద్దేశంతో మొట్ట మొదటి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని థియేటర్స్ లో ఆడియో లాంచ్ లైవ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఏయే ఏరియాల్లో ఏయే థియేటర్స్ లో వేస్తారు అనే వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.

మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అన్ని రకాల రైట్స్ ని ఈరోస్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు