కొండవీడు నేపథ్యంలో గబ్బర్ సింగ్

కొండవీడు నేపథ్యంలో గబ్బర్ సింగ్

Published on Jan 3, 2012 4:02 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం కొండవీడు నేపధ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా భారీ మార్పులు చేసినట్లు సమాచారం. కొండవీడు అనే పధం మెగా అభిమానులకు గుండెల్లో నిలిచిపోయి ఉంది. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు మీడియాకు విడుదల చేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.

ఈ చిత్రం పూర్తి కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా గణేష్ బాబు గారు నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూరుస్తున్నారు. గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు