ట్విట్టర్ లో అడుగుపెట్టిన తమన్నా

ట్విట్టర్ లో అడుగుపెట్టిన తమన్నా

Published on Dec 2, 2013 10:48 PM IST

tamanna
టాలీవుడ్ కుర్రకారుల గుండెలనిండా నిడిన తమన్నా ఎట్టకేలకు ట్విట్టర్ లోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా ఇటువంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఆశ్రయించని ఈ భామ తన అభిమానులతో విశేషాలను తెలుపనుంది. ఇప్పటివరకూ తీరకలేని షెడ్యూల్లతో బిజీగా వున్న ఈ భామకు ఇప్పుడు తీరిక దొరికింది

గతంలో ఇటువంటి వ్యాపకాలపై ఆమెకు ఆశక్తి వున్నట్టు తెలుపకపోయినా ఈరోజు ఈ మిల్కీ బ్యూటీ @ tamannaahspeaks అనే పేరుతో ట్విటర్ ప్రపంచంలోకి జన్మించింది. “హాయ్ ! నేను తమన్నా.. ఇప్పుడే ట్విట్టర్ లోకి వచ్చాను. మీ ట్వీట్లకోసం ఎదురుచూస్తుంటాను” అని తెలిపింది

ప్రస్తుతం తమన్నా శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేశ్ సరసన తొలిసారిగా ‘ఆగడు’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమానేకాక అజిత్ నటిస్తున్న ‘వీరం’లో, అక్షయ్ కుమార్ ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ మరియు సైఫ్ ఆలీ ఖాన్ ‘హమ్ షకల్స్’ సినిమాలలో నటిస్తుంది

తాజా వార్తలు