గుడ్ సినిమా గ్రూప్ సమర్పణలో సంపూర్నేష్ బాబు సినిమా

గుడ్ సినిమా గ్రూప్ సమర్పణలో సంపూర్నేష్ బాబు సినిమా

Published on Dec 2, 2013 1:19 PM IST

Hrudaya-Kaleyam-Movie-First
సినిమా పేరు ‘హృదయ కాలేయం’, హీరో పేరు సంపూర్నేష్ బాబు.. ఈ రెండు పేర్లు గత కొద్ది నెలల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసాయి. కొద్ది రోజుల క్రితం జోరుగా జరిగిన ఈ సినిమా ప్రచారం కాస్త తగ్గింది. మళ్ళీ ఈ సినిమా వార్తల్లో నిలిచింది. గతంలో ‘ఈ రోజుల్లో’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘విల్లా(పిజ్జా 2)’ సినిమాలను మనకు అందించిన గుడ్ సినిమా గ్రూప్ వారి సమర్పణలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబందించిన మరో ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. స్టీవెన్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు క్రిమినల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు