తనపై వచ్చిన రూమర్స్ ని కొట్టి పారేసిన సమంత

తనపై వచ్చిన రూమర్స్ ని కొట్టి పారేసిన సమంత

Published on Dec 1, 2013 3:16 PM IST

samantha
గత సంవత్సరం సమంత కాస్త అస్వస్థతకి గురైంది. అదే విషయాన్ని తీసుకొని ఆమెపై పలుసార్లు వదంతులు సృష్టించారు. అత్తారింటికి దారేది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా, మనం, వివి వినాయక్ సినిమా మరియు సూర్య సినిమాలో నటిస్తోంది.

ఇటీవలే సమంత కాస్త ఆరోగ్యం బాలేదని ట్వీట్ చెయ్యడంతో తనకు మళ్ళీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ విషయంలో బాగా బాధపడిన సమంత ట్విట్టర్ ద్వారా ఆ వార్తలను కొట్టి పారేసింది. ‘ ఎన్.టి.ఆర్, వివి వినాయక్ సినిమాలతో డిసెంబర్ 20 వరకు బిజీగా ఉంటాను. ఆ తర్వాత 23 నుంచి జనవరి 4 వరకు లింగుస్వామి – సూర్య సినిమా షూటింగ్లో పాల్గొంటాను. నేను మాములుగా నా సినిమా షెడ్యూల్స్ గురించి ట్వీట్ చెయ్యను కానీ నాకు ఆరోగ్యం బాగాలేదని వస్తున్న వదంతులకు ముగింపు చెప్పడం కోసం ట్వీట్ చెయ్యాల్సి వచ్చిందని’ సమంత తన ట్విట్టర్లో పేర్కొంది.

త్వరలోనే సమంత ఎన్.టి.ఆర్ తో కలిసి షూటింగ్ లో పాల్గోనుంది. అలాగే సమంత నాగ చైతన్య సరసన నటించిన ‘ఆటోనగర్ సూర్య’ త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు