రజినికాంత్ సినిమా కోసం నీతూ లల్లా కొత్త రికార్డు

రజినికాంత్ సినిమా కోసం నీతూ లల్లా కొత్త రికార్డు

Published on Nov 30, 2013 10:00 PM IST

Neeta-Lulla
గత రెండు దశాబ్దాలుగా తన కాస్ట్యూమ్ డిజైనింగ్ తో భారత సినీ ప్రేక్షకులను మెప్పిస్తూ నాలుగు నేషనల్ అవార్డులను అందుకున్న వ్యక్తి నీతా లుల్లా. ఇప్పుడు ఆమె రజిని కాంత్ నటిస్తున్న ‘కొచ్చాడయాన్’కు పని చెయ్యడం కెరీర్ లోనే అతికష్టమైన పనిగా ఆమె పెర్కుంది.

ఈ సినిమా ఒక యానిమేషన్ చిత్రం అందునా చారిత్రాత్మక నేపధ్యమున్న సినిమా గనుక వేషధారణ విషయంలో ఎక్కడా ఇప్పటి సినిమాలకు పొంతన వుండదు. కేవలం దర్శకురాలి సృజనను బట్టి దేజైన్ చెయ్యాలి. “మేము ప్రతీ ముఖ్యమైన పాత్రకు దాదాపు 150 స్కెచ్ లు వేశాం. అందులోంచి 25 ఎంపిక చేసుకున్నాం” అని తెలిపింది. కాస్ట్యూమ్ విభాగానికి సంబంధించి మా బృందానికి ఇది ఒక కొత్త రికార్డు గా ఆమె పేర్కొనింది.

సౌందర్య రజిని కాంత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజిని కాంత్, దీపికా పదుకునె, శోభన, శరత్ కుమార్, ఆది, రుక్మిణీ మొదలగు తారలు నటించారు. మోషన్ క్యాప్చుర్ పరిజ్ఞానంతో సినిమాను తెరకెక్కించారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా వచ్చే యేడాది మొదట్లో విడుదలకానుంది

తాజా వార్తలు