ప్రిన్స్ మహేష్ బాబు-పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న ‘బిజినెస్ మేన్’ ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్ర నిర్మాతలు భారీ ఓపెనింగ్స్ పై కన్నేశారు. బిజినెస్ మేన్ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు విదేశాలలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు నటించిన చివరి చిత్రం ‘దూకుడు’ మహేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని బిజినెస్ మేన్ చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయవాడ ఏరియాలలో తప్ప ఆంధ్రప్రదేశ్ లోని మిగతా అన్ని ఏరియాలలో వారె స్వయంగా విడుదల చేయబోతున్నారు. బిజినెస్ మేన్ లో మహేష్ పక్కన కాజల్ నటిస్తుండగా తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ముంబై నేపధ్యంగా తెరకెక్కింది.