‘బలుపు’ విజయం అనంతరం కాస్త విరామం తరువాత స్క్రిప్ట్ లను ఆచి తూచి వింటున్న రవి తేజ ఎట్టకేలకు తదుపరి సినిమా మొదలుపెట్టాడు. ఈ మాస్ ఎంటర్టైనర్ కుబలుపుకు స్క్రిప్ట్ ను అందించిన కె.ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడు. సినిమా పేరు ఇంకా ఖరారు కాలేదు
సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 11 న మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనా ముందుగా నిర్మిస్తానన్న వై.వి.ఎస్ చౌదరి ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆగిపోయింది. ప్రస్తుతం రాక లైన్ వెంకటేష్ నిర్మాత
రావితేజ సరసన ఒక నాయికగా హన్సికను ఎంపిక చేయగా మరో హీరోయిన్ అన్వేషణలో వున్నారు. థమన్ సంగీతాన్ని అందించే పనిలో వున్నాడు. ‘ధూమ్’, ‘రేస్’ వంటి సినిమాలకు స్టంట్స్ ను సమకూర్చిన అల్లన్ అమీన్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. హైదరాబాద్, కలకత్తాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది