నితిన్ నటిస్తున్న ‘హార్ట్ ఎటాక్’ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే పనిలో వున్నాడు మన పూరి. డబ్బింగ్, ఎడిటింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి.
ఈ సినిమాలో నితిన్ సరసన అదా శర్మ నటిస్తుంది. పూరి స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం త్వరలో విడుదలకానుంది. ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ హిట్ లతో ఆనందంలో వున్న నితిన్ కు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా హ్యాట్ ట్రిక్ వస్తుందేమో చూద్దాం