మంచు ఫ్యామిలీ హీరోస్ అయిన డా. మోహన్ బాబు, మంచు విష్ణు. మనోజ్ మంచు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మల్టీ స్టారర్ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తున్నారు.
మాములుగా సంక్రాంతి అనగానే పలువురు పెద్ద హీరోల సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేస్తుంటాయి. ఇప్పటికే 2014 సంక్రాతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 – నేనొక్కడినే’, అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’, నితిన్ – పూరిల ‘హార్ట్ అటాక్’ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల పోటీని తట్టుకొని, అలాగే సరిపడా థియేటర్స్ దొరికి ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా సంక్రాంతికే వస్తుందేమో చూడాలి.
‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో మంచు ఫ్యామిలీ హీరోలతో పాటు వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా తెర పంచుకోనున్నారు. ఈ సినిమాలో రవీనా టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి, మణిశర్మ, బప్పి లహరి, బాబా సెహగల్ కలిసి సంగీతం అందిస్తున్నారు.