‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో నితిన్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ అటాక్’. ఈ సినిమా షూటింగ్ నేటితో ముగియనుంది. ఈ సమాచారాన్ని పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. సినిమా చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తాడు అని పేరున్న పూరి ఈ సినిమాని కూడా చాలా త్వరగా పూర్తి చేసాడు.
ఎక్కువ భాగం స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా 2014 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఆద శర్మ హీరోయిన్ గా తెలుగువారికి పరిచయం కానుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. డిసెంబర్ 8న ఆడియో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మంచి కామెడీ మరియు రొమాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.