డిసెంబర్ లో పూర్తికానున్న రఫ్ చిత్రం

డిసెంబర్ లో పూర్తికానున్న రఫ్ చిత్రం

Published on Nov 28, 2013 12:03 AM IST

Rough
ఆది నటిస్తున్న ‘రఫ్’ సినిమా త్వరలో పుర్తికానుంది. ఇటీవలే ఒక పాటను, క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించారు. సమాచారం ప్రకారం ఒక్కపాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఆ మిగిలిన పాటను డిసెంబర్ మొదట్లో తెరకేక్కిస్తారు

ఈ సినిమాను సుబ్బారెడ్డి మరియు అభిలాష్ మాధవరాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆది సరసన రాకుల్ నటిస్తుంది. శ్రీహరి స్వర్గస్థులు కాకముందు నటించిన కొన్ని చిత్రాలలో ఇది ఒకటికావడం విశేషం. ‘రఫ్’ అన్న టైటిల్ లోనే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతుంది

మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది

తాజా వార్తలు