సామాజిక సేవలో అనుష్కతో కలవనున్న శృతిహాసన్

సామాజిక సేవలో అనుష్కతో కలవనున్న శృతిహాసన్

Published on Nov 27, 2013 1:20 AM IST

anushka-and-sruthi-haasan

సామాజిక సేవలు, ప్రాచారాలకోసం చాలామంది తారలు నేడు నడుంకడుతున్నారు. తారల మాటలు అభిమానులకు బంగారు మూటలు కనుక వారు చెప్పే చిన్న పలుకు సైతం సమాజంలో పలుకుబడిగా నిలుస్తుంది. పోలియో చుక్కలు, వోట్లు, అవయవ దానాలు అంటూ ఎప్పుడోఒకప్పుడు ఎవరో ఒకరు మనకు మంచిని మంచిగా చేయమని చెప్తూనే వున్నారు

ఇప్పుడు అనుష్క, శృతిహాసన్ ‘టీచ్ ఎయిడ్స్’ అనే కార్యక్రమం కోసం కలిసారు. ఇది భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఎయిడ్స్ మహమ్మారి వలన నష్టాలను తెలుపనున్నారు . అనుష్క డాక్టర్,గా శృతి పేషెంట్ గా కనిపించబోతున్న ఒక యానిమేషన్ వీడియోకు వీరు గాత్రదానం చేసారు. ఈ ‘టీచ్ ఎయిడ్స్’ వీడియోలో మాటలు తమిళంలో వుంటాయి

వీరే కాక నాగార్జున, సూర్య మరియు సిద్ధార్ధ్ కూడా ఈ ‘టీచ్ ఎయిడ్స్’ సంబంధిత వీడియోలకు గాత్రదానం చేసారు

తాజా వార్తలు