కాస్త లేట్ అయినా పేస్ బుక్ లో అభిమానులను వారి ఆశలను తెలుసుకోవడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తున్నారు. చాలా మంది ప్రొఫైల్ లను స్వయానా ఆ సైట్ వారే పరిశీలించి మరీ అది అభిమాని సుష్టించిన పేజికాదని తెలుపుతారు. కానీ కొంత మంది ఆకతాయులు ఈ సైట్ ను వాడుకుని అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నారు
ప్రస్తుతం ఈ ఫేక్ సైట్ ల భారిన ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ పడ్డాడు. పేస్ బుక్ లో ఒక పేజి పవన్ కళ్యాణ్ అఫీషియల్ పేజిగా చలామణి అవుతుంది. అయితే పవన్ కానీ, ఆయన బృందంకానీ తమను సంప్రదించలేదని సైట్ నిర్వాహకులు స్పష్టం చేసారు.
ప్రస్తుతం మన పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్ 2’ ప్రీ ప్రొడక్షన్ పనిలో వున్నాడు. సంపత్ నంది దర్శకుడు. తారాగణం ఇంకా ఖరారు కాలేదు. మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతారు