వడ్డే నవీన్ కి పితృ వియోగం

వడ్డే నవీన్ కి పితృ వియోగం

Published on Nov 21, 2013 6:20 PM IST

Vadde-Ramesh
అందరికీ తెలిసిన నిర్మాత వడ్డే రమేష్ ఈ రోజు హైదరాబాద్ లో మరణించారు. గత కొద్ది రోజులుగా కాన్సర్ తో భాదపడుతున్న ఆయన కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిర్మాత వద్దే రమేష్ హీరో వడ్డే నవీన్ కి తండ్రి.

నిర్మాత వడ్డే రమేష్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని పాపులాస్ సినిమాలను నిర్మించాడు. ఎన్.టి.ఆర్ గారితో ‘బొబ్బులి పులి’, కృష్ణం రాజుతో ‘కటకటాల రుద్రయ్య’, చిరంజీవితో ‘లంకేశ్వరుడు’ లాంటి కొన్ని సినిమాలను నిర్మించారు. అలాగే రాజశేఖర్ హీరోగా ‘అమ్మ కొడుకు’ సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు.

వడ్డే రమేష్ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి, ఈ విషయం విన్న సినీ ప్రముఖులు షాక్ కి గురయ్యారు. శ్రీ వడ్డే రమేష్ గారి కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపం తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు