దిల్ దీవానా పాటలను ఆవిష్కరించిన కపిల్ దేవ్

దిల్ దీవానా పాటలను ఆవిష్కరించిన కపిల్ దేవ్

Published on Nov 21, 2013 1:16 AM IST

kapil-dev
‘దిల్ దీవానా’ అనే తెలుగు సినిమా ఆడియోను మునుపటి తరం క్రికెటర్ కపిల్ దేవ్ ఆవిష్కరించారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల స్కూల్ నుండి వచ్చిన తుమ్మా కిరణ్ దర్శకుడు. ఈ సినిమాలో రాజార్జున్ రెడ్డి, రోహిత్ రెడ్డి, ఆభా సింఘాల్ మరియు నేహా దేశ్ పాండే ప్రధాన పాత్రలు

ఈ వేడుకలో కపిల్ దేవ్ మాట్లాడుతూ ‘నేను ఒక సినిమా ఆడియో ను ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ నా శుభాశిస్సులు. మీరు చాలా టాలెంట్ కలవారు. ఇటువంటి మ్యూజిక్ ను అలవాటు చేసుకోవడానికి కాస్స్త సమయం పడుతుంది. ఈ సినిమా హిందీలో డబ్ అయతే నేను తప్పకుండా చూస్తాను. మీ దిల్(హృదయం) దీవానా(పిచ్చి) ఎప్పుడు ఎక్కింది అని అడిగితే “నేను మొదటిసారి క్రికెట్ ఆడుతున్నప్పుడు” అని సమాధానమిచ్చారు.

శేఖర్ కమ్ముల తుమ్మా కిరణ్ గురించి మాట్లాడుతూ “నేను కిరణ్ మొదటి సినిమా చాలా రోజుల క్రితమే ఊహించాను. ఆఖరికి ఆ కల నిజమయ్యింది. ఈ సినిమా ఏ నేపధ్యంలో సాగుతుంది అని నేను అడిగితే మీరు మెచ్చుకునే సినిమా అవుతుంది అని చెప్పాడు. ప్రతీ ఒక్కరికీ సినిమా తీయడంలో ఒక్కో శైలి వుంటుంది. కానీ ముఖ్యమైనఅంశం ఏమిటంటే కష్టపడి పని చెయ్యడం” అని చెప్పాడు. దిల్ రాజు, బెల్లంకొండ గణేష్ బాబు, సురేష్ కొండేటి తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. రామ్ నారాయణ్ సంగీత దర్శకుడు. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. రాజా రెడ్డి నిర్మాత

తాజా వార్తలు