దిల్ దివానా ఆడియో రిలీజ్ కి హాజరుకానున్న కపిల్ దేవ్

దిల్ దివానా ఆడియో రిలీజ్ కి హాజరుకానున్న కపిల్ దేవ్

Published on Nov 20, 2013 2:30 AM IST

Dil-Diwana
ఇండియన్ క్రికెట్ లో లెజెండ్రీ, ఆల్ రౌండర్ ప్లేయర్ అయిన కపిల్ దేవ్ ఓ తెలుగు సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ వార్తా అందరినీ షాక్ కి గురి చేసింది, ఎందుకంటే కపిల్ దేవ్ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తో కలవలేదు.

‘దిల్ దివానా’ సినిమా ఆడియో నవంబర్ 20న విడుదల కానుంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి కపిల్ దేవ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర అసోసియేట్ గా పనిచేసిన తుమ్మ కిరణ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆర్. రామ్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రాజ రెడ్డి నిర్మాత. కొత్త నటీనటులు నటించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు