వచ్చేవారం నుండి ప్రారంభంకానున్న సూర్య కొత్త సినిమా

వచ్చేవారం నుండి ప్రారంభంకానున్న సూర్య కొత్త సినిమా

Published on Nov 9, 2013 9:45 AM IST

surya

కొలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్న నటులలో సూర్య ఒకరు. ఇటీవలే ఆయన ‘సింగం 2’ సినిమాలో కనిపించారు. ఆ సినిమా అక్కడా ఇక్కడా కూడా మంచి విజయాన్ని సాధించింది

సూర్య తన తదుపరి చిత్రం గౌతమ్ మీనన్ తో జరగాల్సివుంది అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రొజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా మొదలుకానుంది.
ఈ చిత్రం నవంబర్ 15నా ప్రారంభమై మొదటి షెడ్యూల్ ను 25 రోజులు ముంబైలో జరగనుంది. తదుపరి షెడ్యూల్ గోవాలో జరగనుంది. ఈ సినిమాలో మనోజ్ భాజ్ పై విలన్ గా కనిపించనున్నాడు
కామెడీ బాధ్యతలను బ్రహ్మానందం మోయనున్నాడు.

సమంత ఈ సినిమాలో హీరోయిన్. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదలకానుంది

తాజా వార్తలు