తెలుగు ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కమేడియన్ ఏ.వి.ఎస్ ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా కాలేయ సమస్యలతో
బాధపడుతున్న ఈయన పరిస్థితి ఈరోజు విషమించింది. ఇదివరకు కూడా ఇలానే కాలేయానికి సంభందించిన వ్యాదితో బాధపడితే ఆయన కూతురే కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసింది.
ఆమంచి వెంకట సుభ్రమణ్యం(ఏ.వి.ఎస్) 1957 జనవరి 2న తెనాలిలో జన్మించారు. ఆయన జీవితంలో చాలా భాగం అక్కడే గడిపారు. ఏ.వి.ఎస్ తన కెరీర్ ను పత్రికా విలేఖరిగా ప్రారంభించి 1993 లో ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై ఆ సినిమాలో తన నటనకు గానూ నంది అవార్డును అందుకున్నారు
90వ దశకంలో చాలా హిట్ సినిమాలలో కామెడీ పాత్రలను పోషించిన ఏ.వి.ఎస్‌కు ఎస్.వి కృష్ణారెడ్డి మరియు ఈ.వి.వి సత్యనారాయణ వంటి దర్శకులతో విడదీయలేని సంబంధం వుంది.
తరువాతి కాలంలో ఏ.వి.ఎస్ పలు సినిమాలకు దర్శకత్వం మరియు నిర్మాణ బాధ్యతలు వహించారు
ఈ భాధకార పరిస్థితులలో ఏ.వి.ఎస్ కుటుంబానికి 123తెలుగు.కామ్ ద్వారా అశ్రు నివాళిని ఆర్పిస్తున్నాం