‘సత్య 2’ రిలీజ్ కి తొలగిన అడంకులు

‘సత్య 2’ రిలీజ్ కి తొలగిన అడంకులు

Published on Nov 7, 2013 8:00 PM IST

satya-2
వివాదాలకి పెట్టింది పేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసిన ప్రతి చిత్రం ఏదో ఒక వివాదానికి గురి అవుతూనే వుంటుంది. ఆర్.జి .వి తాజా చిత్రం ‘సత్య 2’ రేపు విడుదల అవ్వబోతుంది . ఈ విడుదల కోసం ఆర్.జి .వి సన్నద్ధమవుతున్నారు. అక్టోబర్ 24 న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎల్. ఆర్ మీడియా గ్రూప్ తో వచ్చిన కొన్ని గొడవల కారణంగా ఆలస్యం అయింది . ఎల్. ఆర్ మీడియా గ్రూప్ ‘ సత్య 2’ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికి ఎల్. ఆర్ మీడియా గ్రూప్ ఈ చిత్ర విడుదల ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కాని కోర్ట్ వారి కోరికని నిరాకరించింది అందువలన ఈ చిత్రం అనుకున్న విదంగా విడుదల అవుతుంది . దిల్ రాజు ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రాన్ని పంపిణి చేయడం ఈ చిత్రం పై అంచనాల్ని ఇంకా పెంచుతుంది .
శర్వానంద్ మరియు అనైక సోతి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. సుమంత్ కుమార్ రెడ్డి నిర్మించారు.

తాజా వార్తలు