‘దేవసేన’ గా అనుష్క

‘దేవసేన’ గా అనుష్క

Published on Nov 7, 2013 12:17 PM IST

Anushka-is-Devasena
రాజమౌళి సినిమా ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్న అందాల నటి అనుష్క దేవసేనగా కనిపించనుంది. దీనికి సంబందించిన మేకింగ్ వీడియోని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దీనిలో అనుష్క, తన టీం వున్నారు. ఈ మేకింగ్ వీడియోని చూస్తుంటే అనుష్కని పర్ఫెక్ట్ గా చూపించడానికి టీం పడుతున్న కష్టం మనకు కనిపిస్తుంది. ఈ సినిమాని భారతదేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా నిర్మించడానికి ఈ సినిమా టీం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్, అనుష్క ల మేకింగ్ వీడియోలను విడుదల చేయడం జరిగింది. అయితే తరువాత వీడియోని రానాది అయ్యే అవకాశం ఉంది. అది రానా పుట్టిన రోజున డిసెంబర్ లో విడుదల చేయవచ్చు. ఈ సినిమాలో కూడా రాజమౌళి రెగ్యులర్ సినిమాలకు పనిచేసినవారే పనిచేస్తున్నారు. రామ రాజమౌళి కాస్ట్యూమ్స్ ని, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా, పీటర్ హెయిన్స్ ఫైట్ మాస్టర్ ఆ పనిచేస్తున్నారు. ఈ సినిమాని ఆర్కా మీడియా నిర్మిస్తోంది.

తాజా వార్తలు