ఈ రోజు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ముగ్గురు ప్రముఖులు తమ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్ లో లెజెండ్, యూనివర్సల్ స్టార్ కమల్ హసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు టాలెంటెడ్, బ్యూటిఫుల్ లేడీ అనుష్క.
కమలహాసన్ 1954 నవంబర్ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7నఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో జన్మించారు. అలాగే అనుష్క 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.
కమల్ హాసన్ ఇండియాలో ఉన్న టాలెంటెడ్ నటులలో ఒకరు. ఆయనకీ సినిమాల పట్ల ఉన్న మక్కువ, ఎంతో డెడికేట్ గా అయన పనిచేసే విధానం ఆయనకీ గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టింది. కమల్ అంటే పెర్ఫెక్షనిస్ట్. ఆయన పాత్ర కోసం ఏమైనా చేస్తారు. ఆయన నటిస్తున్న ‘విశ్వరూపం 2’ సినిమా త్వరలో విడుదల కానుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో తాజాగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈయన పంచ్ డైలాగ్స్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే ఎంతో మంది కొత్త వారు ఆయన్ స్టైల్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
అనుష్క ప్రస్తుతం తన కెరీర్ లో గోల్డెన్ మోమెంట్స్ ని ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె రెండు భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘బాహుబలి’, మరొకటి ‘రుద్రమదేవి’. అలాగే అనుష్కకి మన్చి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ ముగ్గురు సెలబ్రిటీల పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున కమల్ హాసన్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు అనుష్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.