సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా ఆడియో డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకని డిసెంబర్ 15 లేదా 16 తేదీన చేయనున్నారు. ఇప్పటి వరకూ ఈ విషయాన్ని ప్రొడక్షన్ టీం అధికారికంగా అనౌన్స్ చెయ్యలేదు.
కృతి సనన్ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం కానున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దేవీశ్రీ కొన్ని స్పెషల్ ట్యూన్స్ కంపోజ్ చేసాడని సమాచారం. ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.