ఫోటో మోమెంట్ : మెహర్ రమేష్ లేటెస్ట్ క్రియేటివిటీ.

ఫోటో మోమెంట్ : మెహర్ రమేష్ లేటెస్ట్ క్రియేటివిటీ.

Published on Nov 6, 2013 2:51 AM IST

Meher-Ramesh's-creativity-w

విక్టరీ వెంకటేష్ అభిమానులు మరియు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులు డైరెక్టర్ మెహర్ రమేష్ ని అంత తొందరగా మరచిపోలేరు. ఈయన ఈ ఇద్దరు హీరోలకు ‘షాడో’, ‘శక్తి’ అనే సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కోలుకోలేని ఫ్లాప్ సినిమాలను ఇచ్చాడు. ఫ్లాప్ విషయం పక్కన పెడితే ఈ సినిమాల్లో హీరోల లుక్ మరియు వారి పాత్రలను తీర్చిదిద్దిన విధానం అభిమానులను ఇంకా నిరుత్సాహానికి గురి చేసింది.

‘షాడో’ సినిమా రిలీజ్ తర్వాత మెహర్ రమేష్ పబ్లిక్ ని ఆకట్టుకోలేక పోవడంతో అప్పటినుండి పబ్లిక్ కి దూరంగా ఉంటూ తన తదుపరి సినిమాకి సంబదించిన కథలో నిమగ్నమై ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఈ ‘క్రియేటివ్’ డైరెక్టర్ మళ్ళీ బయటకి వచ్చి ఫేస్ బుక్ లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలని పోస్ట్ చేసాడు.

ఆ ఫోటో చూస్తే ‘క్రియేటివ్’ మెహర్ రమేష్ తనకు కావాలనుకున్నది ఎలా సాధించుకుంటున్నాడో తెలుస్తుంది. ఈ ఫోటోని చూసి ఎంజాయ్ చెయ్యండి. అలాగే ఈ ఫోటోపై మీ కామెంట్స్ ని కింద కామెంట్స్ లో తెలియజేయండి..

తాజా వార్తలు