శ్రీహరి స్థానాన్ని భర్తీ చేస్తున్న జగపతి బాబు

శ్రీహరి స్థానాన్ని భర్తీ చేస్తున్న జగపతి బాబు

Published on Nov 5, 2013 5:20 PM IST

srihari-and-jagapathi
రియల్ స్టార్ శ్రీహరి గత నాలుగు వారల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీనితో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయింది. శ్రీహరి చాలా మంచి మనస్తత్వం, దయ, కరుణ గల వ్యక్తి . ఏ సినిమానైన తను ఒప్పుకుంటే సినిమా కోసం ఎంత రిస్క్ అయినా చేయడానికి వెనకాడేవాడు కాదు. ఆయన చనిపోయిన తరువాత దర్శకులు, నిర్మాతలు ఆయన లాంటి వాడికోసం చూస్తున్నారు. చూడటానికి నిజంగా అలా ఉండకపోవచ్చు కానీ ఒక వ్యక్తి మాత్రం తన స్థానాన్నిభర్తీ చేయగలడని అందరూ అనుకుంటున్నారు. అతనే జగపతిబాబు.

ఈ విలక్షణ నటుడు శ్రీహరి అంత గంభీరంగా కనిపించకపోయిన, అతని చరిష్మ, గ్లామర్, టాలెంట్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయగలడని అనుకుంటున్నారు. జగపతి బాబు విలన్ గా, కీలక పాత్రల్లో ఇప్పటికే తన ప్రతిభని నిరూపించుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సాయి ధర్మ తేజ ‘పిల్లనువ్వు లేని జీవితం’ సినిమాలో శ్రీహరి పాత్రలో నటించనున్నాడని సమాచారం. అంతేకాకుండా మరికొంత మంది నిర్వాహకులు కూడా జగపతిబాబును కొన్ని ముఖ్యమైన పాత్రలలో నటించమని అడుగుతున్నారు.

తాజా వార్తలు