ఏ నటుడికైనా, నటి కైనా తనకి తెలిసిన పాత్రల్ని లేదా తనకి కాస్తో కూస్తో పరిచయం ఉన్న పాత్రల్ని చేయడం కాస్త సులువైన విషయం. అదే తమకు పూర్తిగా పరిచయం లేని ఓ పాత్ర చేయడమంటే కత్తిమీదసాము లాంటిదనే చెప్పాలి. ప్రస్తుతం అలాంటి సమస్యే ‘ఎవడు’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కానున్న లండన్ బ్యూటీ అమీ జాక్సన్ కి వచ్చి పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘మనోహరుడు’ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాలో అమీ జాక్సన్ ఓ బ్రాహ్మణ యువతి ‘మణియమ్మాల్’ గా కనిపించనుది. స్వతహాగా లండన్ లో పుట్టి పెరిగిన ఈ క్రిస్టియన్ బ్యూటీకి బ్రాహ్మణ ఇంట్లో ఉండే సాంప్రదాయాలు, మంత్రాలు లాంటివి ఏమీ తెలియదు.
ఇలాంటి పాత్ర తనకు రావడంతో ఆమె ఎంతో సంరోషంగా ఉంది. అలాగే తన పాత్ర గురించి చెబుతూ ‘ ఈ పాత్ర చేస్తుంటే అసలు నేను ఇండియాలో ఎందుకు పుట్టలేదా అనిపించింది. శంకర్ గారు పూర్తిగా నా లుక్ ని మార్చేసారు. శంకర్ గారు ఊహించుకున్న మణియమ్మాల్ కి ప్రతిరూపంగా నన్ను సెలెక్ట్ చేసుకోవడం నా లక్. ఈ పాత్రని జీవితంలో మరచిపోలేనని’ తెలిపింది
ఇప్పటికే ఈమె తమిళ్, హిందీలో సినిమాలు చేసినా తెలుగు తెరపై మాత్రం ఇంకా కనిపించలేదు. అమీ జాక్సన్ రామ్ చరణ్ సరసన నటించిన స్ట్రైట్ తెలుగు మూవీ ‘ఎవడు’ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.