యంగ్ హీరో మంచు విష్ణు నటించిన ‘దూసుకెళ్తా’ సినిమాని మలయాళంలో రిలీజ్ చేయడానికి రంగం సిద్దమైంది. ఈ సినిమా నవంబర్ 8న మలయాళం ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సినిమాని ‘సర్వ కళా వల్లవన్’ పేరుతో మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కేరళలో ఈ సినిమా విడుదలకి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.
విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమాని కూడా ‘ఎన్ దినం రెడీ’ అనే పేరుతో డబ్ చేసి మలయాళంలో రిలీజ్ చేసారు. విష్ణు ‘దూసుకెళ్తా’ సినిమా మలయాళ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అలాగే మలయాళ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘దూసుకెళ్తా’ సినిమాకి వీరూ పోట్ల డైరెక్టర్. లావణ్య త్రిపతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు.