కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానంటున్న వెంకీ

కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానంటున్న వెంకీ

Published on Nov 3, 2013 1:00 PM IST

Pawan-Kalyan,-Venkatesh
ముందు తరం హీరోల్లో టాప్ నలుగురులో ఒకరు విక్టరీ వెంకటేష్, ఆయనకి కెరీర్లో సక్సెస్ లు ఎక్కువగానే ఉండడం కాకుండా ఫ్యామిలీ మెచ్చే హీరోగా కూడా పేరు తెచ్చుకున్నాడు. వెంకటేష్ గారు ఈ సంవత్సరం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీ స్టారర్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. వెంకటేష్ గారు ఈ సంవత్సరాన్ని మరో మల్టీ స్టారర్ సినిమాతో ముగించాలని అనుకుంటున్నారు. ఆయన నటించిన ‘మసాలా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ మరో హీరోగా కనిపించనున్నాడు.

ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు చేయాలనుకుంటున్న దర్శకులకు, నిర్మాతలకు వెంకటేష్ బెస్ట్ చాయిస్ లా మారారు. అదే తరహాలోనే ఆయన తాజాగా మరో మల్టీ స్టారర్ సినిమాకి సైన్ చేసారు. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్లో రానున్న సినిమాని బండ్ల గణేష్ నిర్మించనున్నారు.

తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘భవిష్యత్తులో కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని’ అన్నారు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ కలిసి చేయనున్న సినిమా గురించి చెబుతూ ‘ ఇప్పటి వరకు మూడు కథలను విన్నాను. అవేవీ పర్ఫెక్ట్ గా అనిపించలేదు. ప్రస్తుతం సరైన కథ కోసం వేచి చూస్తున్నానని’ తెలిపారు.

తాజా వార్తలు