రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసంటున్న డైరెక్టర్

రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసంటున్న డైరెక్టర్

Published on Nov 3, 2013 9:30 AM IST

Rana-and-Vishnuvardhan
తమిళ్ లో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హిట్స్ అందుకున్న డైరెక్టర్ విష్ణు వర్ధన్ తెలుగులో ‘పంజా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. తాజాగా విష్ణు వర్ధన్ అజిత్ హీరోగా చేసిన ‘ఆరంభం’ సినిమా దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించాడు. రానా ఈ పాత్ర చేయడానికి గల కారణం గురించి విష్ణు వర్ధన్ చెబుతూ ‘ నాకు రానా చిన్ననాటి నుంచి తెలుసు. అప్పట్లో బాగా లావుగా ఉండేవాడు. కానీ తను చేసి హార్డ్ వర్క్ వల్ల బరువు తగ్గడమే కాకుండా హంక్ లాగా కనబడుతున్నాడు. నా సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎవరన్నా కొత్త వారు కావాలని ఆలోచిస్తుంటే నాకు రానా గుర్తొచ్చాడు. నేను అతన్ని అడగ్గానే మా ఫ్రెండ్ షిప్ వాళ్ళ అతను వెంటనే ఒప్పుకున్నాడని’ తెలిపాడు.

ఆర్య, నయనతార, తాప్సీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ‘ఆరంభం’ సినిమా ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

తాజా వార్తలు