మసాలా ప్రోమోకోసం జతకట్టిన రామ్ మరియు వైవా హర్ష

మసాలా ప్రోమోకోసం జతకట్టిన రామ్ మరియు వైవా హర్ష

Published on Nov 1, 2013 10:00 PM IST

Ram-and-Viva-Harsha
వెంకటేష్ మరియు రామ్ హీరోలుగా నటిస్తున్న ‘మసాలా’ సినిమా ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ కు రిమేక్.

‘మసాలా’ చిత్ర బృందం ప్రాచార విధానాలలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాది. గత నెలలో వెంకటేష్ తో ఒక హాస్యభరితమైన వీడియోను విడుదలచేస్తే ఈరోజు రామ్ పాల్గొన్న మరో వీడియోను విడుదలచేసారు. ‘వైవా’ అనే లఘుచిత్రంలో నటించి మన్ననలుపొందిన హర్ష ఈ వీడియోలలో కామెడీని మేళవించాడు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇలా వైవిధ్యంగా ప్రచారంలోపాల్గొనే సూచనలు వున్నాయి. ఈ సినిమా భారీ రీతిలో ఈ నెల 14న విడుదలకానుంది

ఈ చిత్రంలో అంజలి, షాజన్ పదాంసీ హీరోయిన్స్. కె. విజయభాస్కర్ దర్శకుడు. థమన్ సంగీతాన్ని అందించాడు. సురేష్ బాబు, స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు

తాజా వార్తలు