సౌత్ లో మార్కెట్ ను సంపాదించుకున్న అతి కొద్దిమంది నటులలో విశాల్ ఒకడు. అతను ఆఖరిగా నటించిన ‘వాడు వీడు’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. అయతే ప్రస్తుతం విశాల్ నటించిన ‘పల్నాడు’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 2న భారీ రీతిలో విడుదలకు సిద్ధమయ్యింది. కాకపోతే ఈ సినిమా తమిళ వెర్షన్ విడుదలకు కర్ణాటకలో చుక్కెదురయ్యింది
కర్ణాటక ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం తమిళ సినిమాల ప్రచారాన్ని నిలిపివేశారు అజిత్ నటించిన ‘ఆరంభం’ విడుదలజాప్యానికి కూడా ఇదే కారణం
ఈ సినిమాలో లక్ష్మి మీనన్ హీరోయిన్. డి ఇమ్మన్ సంగీతాన్ని అందించాడు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ ద్వారా నిర్మించాడు