మరోసారి ఈగకు అవార్డుల పంట

మరోసారి ఈగకు అవార్డుల పంట

Published on Nov 2, 2013 3:53 PM IST

eega
‘ఈగ’ సినిమా విడుదలై దాదాపు యేడాది పైన కావస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వస్తున్న అవార్డుల సంఖ్య ఆగట్లేదు. వివిధ చిలనచిత్ర వేడుకలలో, అవార్డుల ఫంక్షన్లలో చాలా అవార్డులు గెలుచుకున్న్ ఈ చిత్రం ఇప్పుడు మరికొన్ని అవార్డులను సొంతం చేసుకుంది. టొర్నొటో ఎనిమిదవ ఏడాది సందర్భంగా ఆఫ్టర్ డార్క్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఏకంగా 9 అవార్డులను సొంతం చేసుకుంది. వాటిల్లో ఉత్తమ విలన్, ఉత్తమ హీరో, ఉత్తమ చిత్రం లు కుడా వున్నాయి.

ఇలా ప్రదర్శితం అవుతున్న ప్రతీ చోట అవార్డులు గెలుచుకుంటున్న ఏకైక సినిమాగా ‘ఈగ’ చరిత్రలో నిలిచింది. రాజమౌళి ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు

తాజా వార్తలు