సెన్సార్ పూర్తిచేసుకున్న డి ఫర్ దోపిడీ

సెన్సార్ పూర్తిచేసుకున్న డి ఫర్ దోపిడీ

Published on Nov 2, 2013 7:10 PM IST

D_for_Dopidi_New_Posters-(3
ఈ మధ్య వినిపిస్తున్న చిన్న చిత్రాల పేర్లలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘డి ఫర్ దోపిడీ’ . నిజానికి నాని ఈ సినిమాలో వాటా తీస్కోవడంతో అంచనాలు మరింత పెరిగాయి.

ఈరోజు ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని ‘యు/ఏ’ సర్టిఫికేట్ సంపాదించుకుంది. కావలసినంత కామెడీ ని చొప్పించిన క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా మనముందుకు రానుంది. ఇటీవలే నాని ఈ సినిమాకోసంఒక ప్రచారగీతంలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసాయి. మొత్తం ఆంధ్ర హక్కులను దిల్ రాజు సొంతం చేసుకుని నవంబర్ ఆఖరివారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు

సందీప్ కిషన్ మరియు వరుణ్ సందేశ్ హీరోలు. మెలనీ హీరోయిన్ గా పరిచయం కానుంది. సిరాజ్ కల్లా దర్శకుడు. మహేష్ శంకర్ సంగీతాన్ని అందించాడు. కృష్ణ మరియు రాజ్ సంయుక్త నిర్మాతలు

తాజా వార్తలు