బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు

బస్సు ప్రమాదంలో మృతి చెందిన కర్ణాటక మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు

Published on Oct 30, 2013 1:45 PM IST

venkatesh

బుధవారం తెల్లవారు జామున జరిగిన వోల్వో బస్ ప్రమాదంతో ఆంద్రప్రదేశ్ మొత్తం షాక్ కు గురైంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో కర్ణాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె వెంకటేష్ మరియు అతని చెల్లెలు వున్నారు. వెంకటేష్ ఒక ఫ్యామిలీ ఫంక్షనుకు హాజరుకావడానికి అతని చెల్లెలితో కలిసి హైదరాబాద్ కు వస్తున్నాడు. అతను చనిపోయిన వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ చాలా కలతచెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఈ ప్రమాదానికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ తెలియజేసింది.

తాజా వార్తలు