సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా 2014 జనవరిలో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. అప్పుడే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఈ సినిమా విశాఖపట్నం రైట్స్ గాయత్రీ ఫిల్మ్స్ వారు ఒక ఫాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు.
మాకు అందిన సమాచారం ప్రకారం సుమారు 5 కోట్లకి డీల్ ముగిసినట్లు, అందులో 4.5 కోట్లు(నాన్ రీఫండబుల్ అమౌంట్) వెనక్కి ఇవ్వకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని ఆశిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. డీవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీ ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా కనిపిస్తోంది.