టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుకు సతీమణిగా నమ్రత చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతుంది. కానీ నమ్రతకు మహేష్ తో కలిసి ర్యాంప్ వాక్ చెయ్యాలనేకోరిక మాత్రం వుందట. ఈ విషయం తానే స్వయంగా హైదరాబాద్ టైమ్స్ పత్రికకు తెలిపింది.
నమ్రత ఇటీవలే తన ఆప్తమిత్రుడైన తరుణ్ తహిలియాని తో కలిసి ర్యాంప్ పై నడిచింది. ఇండియాలో ప్రముఖ డిజైనర్లతో పనిచేసి, టాప్ మోడల్ గా వెలిగిన అనుభవం నమ్రతకు వుంది. అటువంటి ప్రముఖ డిజైనర్లు హైదరాబాద్ కు వస్తే ఆ వేడుకలకు తప్పకుండా హాజరవుతుంది. ఇప్పట్లో తిరిగి వెండితెరపై కనిపించే అవకాశాలు లేవని నమ్రత తేలిచిచెప్పింది