ఆర్.ఎఫ్.సిలో షూటింగ్ జరుపుకుంటున్న రేస్ గుర్రం

ఆర్.ఎఫ్.సిలో షూటింగ్ జరుపుకుంటున్న రేస్ గుర్రం

Published on Oct 29, 2013 4:26 PM IST

Allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నిన్న రాత్రి అల్లు అర్జున్ – కిక్ శ్యాం పై వచ్చే కొన్ని సన్నివేశాలను హెలిపాడ్ జంక్షన్ వద్ద షూట్ చేసారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సలోని సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు