యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన ఓ హౌస్ సెట్ లో ఎన్.టి.ఆర్ – విలన్స్ పై ఓ ఫైట్ ని షూట్ చేసారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాలో హై రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 2014 సమ్మర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘రభస’ అనేది వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు, కానీ ఈ చిత్ర టీం ఈ టైటిల్ ని ఫిక్స్ అవ్వకుండా వేరే టైటిల్స్ ని కూడా పరిశీలిస్తోంది.