​​ఆంధ్రప్రదేశ్ లో ‘క్రిష్ 3’ కి సూపర్బ్ బిజినెస్

​​ఆంధ్రప్రదేశ్ లో ‘క్రిష్ 3’ కి సూపర్బ్ బిజినెస్

Published on Oct 28, 2013 5:25 PM IST

​​krrish3-telugu
హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘క్రిష్ 3’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందే అన్ని ఏరియాలలో మంచి బిజినెస్ చేసింది. అలాగే ఆంద్రప్రదేశ్ లో కూడా ఈ సినిమాకి మంచి మార్కెట్ ఉండడంతో ఫాన్సీ ధరకు రైట్స్ కొనుకోలు చేసినట్టు సమాచారం.

మాకందిన సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలకు ముందే ఆంద్ర ప్రదేశ్ లో 8 కోట్ల నుండి 9 కోట్ల బిజినెస్ చేసింది. దీనిలో ఒక్క నైజాం నుండే సగం వచ్చిందని సమాచారం. ఇతర భాష హీరోకి ఇంతపెద్ద అమౌంట్ రావడం చెప్పుకోదగిన విషయం. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, కంగన రనౌత్ హీరోయిన్స్ గా నటించారు. వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో విలన్ గా​నటించాడు​.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించాడు

తాజా వార్తలు