ఫిలిం వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త షికారు చేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీకి భారీగా రంగం సిద్ధమైంది. అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ జంటగా నటించిన చిత్రం ‘జంజీర్’ రిమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమితాబ్ కెరీర్ ని మార్చిన చిత్రం జంజీర్ చిత్రానికి ప్రకాష్ మెహ్రా దర్శకుడు. ఇన్ని సంవత్సరాల తరువాత ప్రకాష్ మెహ్రా తనయుడు అమిత్ మెహ్రా రామ్ చరణ్ తో రిమేక్ చేయాలనీ భావించాడు. ఈ రిమేక్ కి అపూర్వ లకియా డైరెక్ట్ చేయబోతుండగా హీరోయిన్ గా నటించడానికి ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ని సంప్రదించినట్లు సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలను అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారు. అమితాబ్ పాత్ర రామ్ చరణ్ ఎంత మేరకు చేసి మెప్పించగలడు అనేది త్వరలోనే సమాధానం దొరుకుతుంది.
బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్?
బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్?
Published on Dec 30, 2011 3:30 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!