మార్చ్ లో విడుదల కానున్న రచ్చ

మార్చ్ లో విడుదల కానున్న రచ్చ

Published on Dec 30, 2011 1:50 AM IST

రామ్ చరణ్ నటిస్తున్న “రచ్చ ” చిత్రం మార్చ్ కి వాయిదా పడింది. గతం లో ఈ చిత్రం ఫిబ్రవరి లో తమిళ మరియు తెలుగులో విడుదల అవ్వనుంది అని ఒక ప్రముఖ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూ లో రామ చరణ్ తెలిపారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు .రామ్ చరణ్ మరియు తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తుండగా. అజ్మల్ అమీర్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుపుకుంది. పరస జైన్ మరియు ఎన్వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సమయం లో “ఫస్ట్ లుక్ ” విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు