టాలీవుడ్ నుండి బాలివుడ్ విజయ సూత్రం పట్టుకున్నట్టుంది. 2011 లో సల్మాన్ “రెడీ” రీమేక్ తరువాత “డీ” చిత్రాన్ని రీమేక్ చెయ్యబోతున్నారు. ఈ చిత్రం లో సంజయ్ దత్ మంగళ్ భాయ్ అని శ్రీ హరి పాత్రలో నటిస్తుండగా కథానాయకుడి పాత్రలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. “లక్ష్మి నరసింహ” చిత్రాన్ని సంజయ్ దత్ రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కే.ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. “సన్ ఆఫ్ సర్దార్” అనే పేరుతో అజయ్ దేవగన్ మర్యాద రామన్న చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు . “రౌడీ రాథోడ్” అనే పేరుతో రవితేజ “విక్రమార్కుడు” చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ రవితేజ “కిక్” ని రీమేక్ చేస్తున్నారు ఈ చిత్రం లో సోనాక్షి సిన్హా కథానాయికగా చేస్తున్నారు. అప్పట్లో పద్మాలయ స్టూడియోస్ వారు ఇక్కడ విజయవంతమయిన చిత్రాలను తీసుకెళ్ళి అక్కడ తీసేవారు కథానాయకులుగా అనిల్ కపూర్ మరియు జితేంద్ర ఉండేవారు. 1980 ల లో ఈ విధానం ఎక్కువగా వుండేది మళ్ళి ఇప్పుడు ఈ విధానం బాలివుడ్ ని తాకింది.