ఈ రోజు విడుదలవుతున్న ‘ఇష్క్’ పాట

ఈ రోజు విడుదలవుతున్న ‘ఇష్క్’ పాట

Published on Dec 28, 2011 9:45 AM IST


నితిన్-నిత్యా మీనన్ జంటగా విక్రమ్. కె. కుమార్ డైరెక్షన్లో రూపోడుతున్న చిత్రం ‘ఇష్క్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండటం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోలో మొదటి పాట ‘ఐ వానా పార్టీ యో, యు వానా పార్టీ యో లచ్చమ్మ’ అనే పాటను ఈ రోజు ప్రముఖ ఎఫ్.ఎమ్ చానల్ లో విడుదల చేయబోతున్నారు. ఫేమస్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి పని చేస్తుండటం ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్. కె. కుమార్ గతంలో మాధవన్ తో 13బి అనే థ్రిల్లర్ చిత్రం తీసారు. చాల కాలంగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న నితిన్ కి ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు