‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం 8 గంటలకు భాయ్ సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నాగార్జున దొరబాబు ఆఫ్ దుబాయ్ అలియాస్ ‘దుబాయ్ దొరబాబు’గా కనిపించనున్నాడు.
నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆహనా పెళ్ళంట’, ‘పూల రంగడు’ లాంటి సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్న వీరభద్రం చౌదరి ఈ సినిమాకి డైరెక్టర్. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.