నవీన్ చంద్ర తెలుగులో మొదటి సినిమా ‘అందాల రాక్షసి ‘తో తన నటన ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందాడు. అతని తరువాత చిత్రం ”దళం” విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాడు. కానీ దీని వెనుక దైర్యం మరియు నిబద్దత తో కూడిన ఆసక్తిపరిచే కథ ఉంది.
నవీన్ హీరో అవ్వాలనే పట్టుదలతో 2003 లో హైదరాబాద్ కి వచ్చాడు. కాకపోతే పేదరికం కారణంగా ఆల్ఫా కేఫ్ లో వెయిటర్ గా పనిచేసాడు. అంతేకాక అతను పాల ప్యాకెట్లు, వార్తాపత్రికలు కూడా పంచడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. యానిమేషన్ రంగం లో పనిచేసిన తర్వాత రామానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో నృత్య కళాకారుడిగా పనిచేసాడు.
తమిళంలో అవకాశం రావడంతో తన నటనా జీవితానికిమార్గం సుగమం అయ్యింది. కొన్ని జయాపజయాల తరువాత హను రాఘవాపుడి యొక్క ”అందాల రాక్షసి”లో గుర్తుండిపోయే పాత్ర పోషించగలిగాడు. ఇదండి వెయిటర్ నుండి యాక్టర్ గా మారిన నవీన్ యొక్క జీవితకధ.