యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు సంగీత దర్శకుడు థమన్ స్వరాలను అందిస్తున్నాడు. సమాచారం ప్రకారం ఈ సినిమాకు థమన్ ప్రయోగాత్మక రూపంలో సంగీతాన్ని అందిస్తున్నాడట . ఈ సినిమాలో కొత్తరకం వాయిద్యాలను వాడాడని వినికిడి . ఈ సినిమా ఆడియో ఈ నెల చివరి వారంలో గానీ సేప్ప్తేమ్బెర్ మొదటివారంలో గానీ విడుదల చేస్తారు
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సమంత హీరో హీరోయిన్స్. ఒక ముఖ్య పాత్రలో శృతిహాసన్ కనిపిస్తుంది. హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజ్ నిర్మాత. ఈ చిత్రం సెప్టెంబర్ 27 న విడుదలకు సిద్ధమవుతుంది
ఈ చిత్రం యాక్షన్ అంశాలను మేళవించిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. హరీష్ శంకర్ హీరోను ఒక రేంజ్ లో చూపిస్తాడు గనుక ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు