దసరాకు విడుదలకానున్న చందమామలో అమృతం

దసరాకు విడుదలకానున్న చందమామలో అమృతం

Published on Aug 13, 2013 9:05 PM IST

cla
ఇండియాలో మొదటిసారిగా స్పేస్ నేపధ్యంలో తీస్తున్న చిత్రం ‘చందమామలో అమృతం’ దసరాకు విడుదలకానుంది. ఈ సినిమా ఆగష్టులో విడుదలవ్వాల్సివుంది. కానీ భారీ రీతిలో వున్న గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా దసరాకు వాయిదాపడింది. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా స్పేస్ లో తీస్తున్న ఈ సినిమా రెండవ భాగం చందమామ మీద జరుగుతుంది. శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు యింటూరి మరియు ధన్య బాలకృష్ణన్ నటిస్తున్నారు. ఈ సినిమా హాస్యభరితంగా సాగుతుందని దర్శకుడు రచయిత గుణ్ణం గంగరాజు తెలిపారు. టి.వి సీరియల్ ‘అమృతం’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 60 నిముషాల పాటూ సాగే గ్రాఫిక్స్ ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా జస్ట్ యెల్లో మీడియా బ్యానర్ పై నిర్మాణమవుతుంది

తాజా వార్తలు