డబ్బింగ్ పనుల్లో బిజీగా పవర్ స్టార్

డబ్బింగ్ పనుల్లో బిజీగా పవర్ స్టార్

Published on Jul 24, 2013 12:15 PM IST

Pawan-kalyan-Latest-Stills-
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. గత రాత్రి ఆయన కొన్ని గంటల పాటు డబ్బింగ్ చెప్పడం జరిగింది. దీనితో పాటుగా ఈ సినిమాకు సంబందించిన మరి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడావేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఆగష్టు 7న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబందించిన ఈ కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరిగేల డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకుంటున్నారు. సమంత, ప్రణితలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటులు కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బోమన్ ఇరానీ, నందితలు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు